ఘనంగా మాజీ ప్రధాని పీవీ జయంతి
ముకరంపుర, జూన్ 28 (విజయక్రాంతి) : మాజీ ప్రధాని పి.వి, నరసింహారావు జయంతిని పురస్కరించుకొని జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో కరీంనగర్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, కరీంనగర్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైద్యుల అంజన్ కుమార్, మాజీ శాసనసభ్యులు ఆరేపల్లి మోహన్, అర్బన్ బ్యాంక్ చైర్మన్ కర్ర రాజశేఖర్ లతోపాటు పలువురు నాయకులు, కార్యకర్తలు, పి.వి.నరసింహారావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించినారు. ఈ కార్యక్రమంలో నాయకులు వెన్న రాజమల్లయ్య, గుండాటి శ్రీనివాస్ రెడ్డి, ఆకుల ఉదయ్, వంగల విద్యాసాగర్, తదితరులు పాల్గొన్నారు.
దివంగత మాజీ ప్రధాని పీవీకి బ్రాహ్మణసంఘం ఘన నివాళులు
వేములవాడ, జూన్ 28 (విజయక్రాంతి) రాజన్న సిరిసిల్ల జిల్లా, వేములవాడ పట్టణంలో ని శంకరమఠంలో భారత మాజీ ప్రధానమంత్రి, వేముల వాడ దేవస్థానం మాజీ ధర్మకర్త పా ములపర్తి వెంకట నరసింహారావు జ యంతి సందర్భం గా బ్రాహ్మణ సంఘం నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. సంఘం గౌరవాధ్యక్షులు ప్రతాప రామకృష్ణ మాట్లాడుతూ ఆయన దేశానికి చేసిన విశిష్ట సేవలను కొనియాడారు.






