29 June, 2026 | 1:38 AM

ఇండియా బుక్ అఫ్ రికార్డ్‌లో చోటు దక్కించుకున్న చిన్నారి

29-06-2026 12:00 AM

అభినందించిన ఎమ్మెల్యే గంగుల

కరీంనగర్, జూన్ 28 (విజయక్రాంతి): నగరంలోని  మంకమ్మతోట కు  చెందిన అయిదేళ్ల చిన్నారి ఇండియా బుక్ ఆఫ్ రికార్డు-2026లో పేరు నమోదు చేసుకుంది. బి.రాజేంద్రప్ర సాద్, ప్రత్యూషల కుమార్తె బొబ్బిలి నిధిశ్రీ పటేల్ స్థానిక ఓ ప్రైవేటు పాఠశాలలో ఒకటో తరగతి చదువుతుంది. నిధిశ్రీ నాలుగేళ్ల వయసులోనే తైక్వాండో సాధన ప్రారంభించింది. శిక్షణ మొదలైన కొన్ని నెలల్లోనే తెలంగాణ తైక్వాండో అసోసియేషన్ రాష్ట్ర స్థాయి ఛాంపియన్ షిప్లో పతకం సాధించి సత్తా చాటింది.

ఒక నిమిషంలో 112 తైక్వాండో కిక్స్ ప్రదర్శించిన వీడియోను మే 27న ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్సుకు పంపించగా జూన్ 3న రికార్డ్సులో స్థానం కల్పించినట్లు నిర్ధారించారు. ఆదివారం చిన్నారిని మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ సన్మానించారు.

ఇంత చిన్న వయస్సులో అద్భుతాలు సృష్టిస్తున్న చిన్నారి భవిష్యత్తులో.. దేశానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ రవీందర్ సింగ్, మాజీ గ్రంధాలయ సంస్థ చైర్మెన్లు పొన్నం అనిల్ కుమార్ గౌడ్, ఏనుగు రవీందర్ రెడ్డి, కార్పొరేటర్ నలువాల  పుష్ప లత- రవీందర్ లు పాల్గొన్నారు.