calender_icon.png 3 August, 2025 | 9:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సింగిల్ విండో మాజీ చైర్మన్ పెద్దన్న మృతి

03-08-2025 07:32:17 PM

బెల్లంపల్లి అర్బన్,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండల కాంగ్రెస్ సీనియర్ నేత చంద్రవల్లి సింగిల్ విండో మాజీ చైర్మన్ సంగతి పెద్దన్న (92) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో ఉన్న ఆయననూ మంచిర్యాల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆదివారం ఆస్పత్రిలోనే తుదిశ్వాస విడిచారు. బెల్లంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతగా సంగతి పెద్దన్న గుర్తింపు పొందారు. కొద్దిరోజులుగా అనారోగ్యంతోఉన్నారు. గత నెల 31న మంచిర్యాలలో ప్రైవేటు హాస్పిటల్ లో చేరారు.  చికిత్స పొందుతూ ఆసుపత్రిలోనే తుది శ్వాస ను వదిలినారు.

సుదీర్ఘ కాలంగా  బెల్లంపల్లి కాంగ్రెస్ పార్టీకి  సేవలు అందించారు. అలాగే చంద్రవెల్లి కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ గా చేశారు. సింగరేణిలోనూ ఉద్యోగం  చేసి కార్మికులకు సేవలు అందించారు. సంగతి పెద్దన్న మరణం కాంగ్రెస్ పార్టీకి, ప్రజలకు  మరణం తీరని లోటుగా కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు. పలువురు కాంగ్రెస్ నేతలు సంగతి పెద్దన్న మరణ వార్త తెలియగానే ఆయన భౌతికయానికి శ్రద్ధాంజలి ఘటించి, కుటుంబాన్ని పరామర్శించి సంతాపం తెలిపారు.