03-08-2025 07:34:42 PM
మహబూబాబాద్,(విజయక్రాంతి): ప్రపంచ తెలుగు మహ సభ సన్నాహాల్లో భాగంగా ఆదివారం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని మహర్షి విద్యాలయంలో మానుకోట రచయితల వేదిక, ఆంధ్ర సారస్వత పరిషత్ సంయుక్త ఆద్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి గుర్రపు సత్యనారాయణ అధ్యక్షత వహించారు. ఈ కవి సమ్మేళనానికి ముఖ్య అతిథిగా ఆంధ్ర సారస్వత పరిషత్ తరపున గజల్ శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ కవి సమ్మేళనంలో వివిధ ప్రాంతాల నుండి కవులు హాజరై తమ కవిత గానాలను వినిపించారు. పలువురు కవులను సత్కరించారు .