03-08-2025 07:27:23 PM
మహబూబాబాద్,(విజయక్రాంతి): గౌడ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్ సంస్థ ఆవిర్భావించి 50 ఏళ్లు పూర్తి చేసుకున్న మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని వికాస్ డిగ్రీ కళాశాలలో గోపా మహబూబాబాద్ జిల్లా కమిటీ అధ్యక్షుడు కుర్ర శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో ఫర్నోస్తవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చిత్రపటానికి పూల మాలవేసి, అనంతరం కేక్ కట్ చేశారు. జిల్లాలో పదవ తరగతిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన గౌడ విద్యార్థులు యాసారపు వెన్నెల, మారగాని సాయిని శాలువాలతో సత్కరించి ప్రతిభ పురస్కారాలను అందించారు.