గుంతలు పూడ్పించిన సుడా మాజీ
22-08-2026 12:33 PM
ముకరంపుర, ఆగస్టు 22(విజయ క్రాంతి): కరీంనగర్ అంబేద్కర్ స్టేడియం వాకింగ్ ట్రాక్ లో నీళ్లు నిలువ కుండా సుడా మాజీ చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి గుంతలు పూడ్పించారు. అంబేద్కర్ స్టేడియం వాకర్స్ సుడా మాజీ చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డిని కలిసి ఇటీవల కురిసిన వర్షాలకు వాకింగ్ ట్రాక్ లో నీళ్లు నిలిచి, ట్రాక్ పై గుంతలు పడటం వల్ల వాకింగ్ చేయడం చాలా ఇబ్బందికరంగా ఉందని, ఇరువైపుల పెరిగిన చెట్ల పొదలు తొలగించి గుంతలు పూడ్చాలని కోరగా వారం రోజులు ఇక్కడే వాకింగ్ చేస్తూ దగ్గరుండి పనులు పర్యవేక్షించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పి పనులు చేపించారు. ఈ సందర్భంగా వాకర్స్ అందరూ సంతోషం వ్యక్తం చేస్తూ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలియజేశారు






