22 August, 2026 | 1:53 PM

ఆధ్యాత్మిక కేంద్రాల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత

22-08-2026 01:02 PM

మహబూబ్‌నగర్ (విజయ క్రాంతి): ఆధ్యాత్మిక కేంద్రాల అభివృద్ధికి ప్రజా ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శనివారం నగరంలోని ఇండస్ట్రీయల్ ఏరియాలో కొలువైన శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవాలయం ప్రహరీ గోడ నిర్మాణ పనులకు ఎస్‌డీఎఫ్ నిధుల నుంచి మంజూరైన రూ.10 లక్షలతో ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రజల ఆధ్యాత్మిక విశ్వాసాలకు అనుగుణంగా దేవాలయాల అభివృద్ధితో పాటు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం సహకారం అందిస్తుందని తెలిపారు. అన్ని వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం పనిచేస్తోందని పేర్కొన్నారు. 

నగర ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నామని, నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు నిరంతరం కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. ఆధ్యాత్మిక కేంద్రాల అభివృద్ధితో పాటు ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ గుమ్మాల మమత శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ మారేపల్లి సురేందర్ రెడ్డి, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహారెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సిరాజ్ ఖాద్రీ, బుద్దారం సుధాకర్ రెడ్డి, కార్పొరేటర్లు వాణిశ్రీ ప్రశాంత్, రమేష్ రెడ్డి, మేగ్యా నాయక్, నాయకులు మైత్రి యాదయ్య, వర్థ రవి, రమేష్ యాదవ్, రాఘవ, పీర్ మహ్మద్ సాధిక్, చంద్రమౌళి, తుప్పలి ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.