9 April, 2026 | 1:28 PM

42 ఏళ్ల తర్వాత సొంతింటికి మావోయిస్టు మాజీ అగ్రనేత దేవ్‌జీ

09-04-2026 11:45 AM

స్వస్థలం కు వచ్చిన తిప్పరి తిరుపతి అలియాస్ దేవ్ జి 

కోరుట్ల,(విజయక్రాంతి): మావోయిస్టు పార్టీ మాజీ అగ్రనేత తిప్పరి తిరుపతి అలియాస్ దేవ్ జీ(Former Top Maoist Leader Devji) సుదీర్ఘమైన 42 సంవత్సరాల తర్వాత తన స్వగ్రామమైన కోరుట్లకు తిరిగి వచ్చారు ఇటీవల పోలీసులకు లొంగిపోయి జన జీవనం స్రవంతిలోకి అడుగుపెట్టిన దేవ్ జీ దాదాపు 42 ఏళ్ల తర్వాత అడుగుపెట్టడం స్థానికంగా ఉద్వేగ వాతావరణం సృష్టించింది. పీపుల్స్ వార్ దళ సభ్యుడిగా ప్రారంభమైన ప్రస్థానం అంచలంచలుగా ఎదిగి అనంతరం కేంద్ర కమిటీ కార్యదర్శి స్థాయి వరకు ఏదిగాడు.

మారుతున్న పరిస్థితులు ఆపరేషన్ కగారు వంటి పరిణామాల నేపథ్యంలో ఫిబ్రవరి 22  ఆయన లొంగిపోయారు. అనంతరం ఇప్పటివరకు హైదరాబాదులో ఉన్న దేవుజీ ఆయన కుటుంబ సభ్యులు బంధువులు మిత్రులు హైదరాబాద్ వెళ్లి ఆయనను ఆహ్వానించి కోరుట్లకు తీసుకువచ్చారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు ఇకపై క్రియాశీల రాజకీయాల ద్వారా ప్రజా పోరాటం కొనసాగిస్తానని మీడియాకు తెలిపారు. దీంతో ఆయన రాకతో కోరుట్ల రాజకీయ సామాజిక వర్గాల్లో చర్చలు జోరందుకున్నాయి .