9 April, 2026 | 1:30 PM

భజన ఆశ్రమానికి భూదానం

09-04-2026 11:46 AM

పాపన్నపేట,ఏప్రిల్09: పాపన్నపేట మండల పరిధిలోని యూసుఫ్ పేట గ్రామంలో శ్రీ శివరామ దీక్షితుల భజన ఆశ్రమ నిర్మాణం కోసం అదే గ్రామానికి చెందిన ముగ్గురు దాతలు రెండు గుంటల భూమిని దానం చేసినట్లు భజన మండలి సభ్యులు డాక్టర్ అవుసుల నర్సింలు వెల్లడించారు. అదే గ్రామానికి చెందిన వడ్డేపల్లి జయరాం రెడ్డితో పాటు బైండ్ల నారాయణ, అదృష్ణ సోదరులు భూదానం చేసినట్లు ఆయన తెలిపారు. కాగా ఆశ్రమ నిర్మాణం కోసం అదే గ్రామానికి చెందిన డాక రెడ్డి గారి మధుసూదన్ రెడ్డి తో పాటు స్థానికులు ఆర్థిక సాయం అందజేశారని, ఇందుకు సహకరించిన దాతలకు శివరామ దీక్షితుల శిష్యులతో పాటు భజన మండలి సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.