11-03-2025 07:26:39 PM
కామారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలో మంగళవారం ఇందిరా మహిళ క్యాంటీన్ ప్రారంభోత్సవ కార్యక్రమం అనంతరం మహిళా సంఘం భవనంలో నూతన డ్వాక్రా మహిళా సమైక్య అధ్యక్షులను దోమకొండ మాజీ జడ్పిటిసి తీగల తిరుమల గౌడ్ శాలువలతో సన్మానం చేశారు. నూతన అధ్యక్షులుగా భూలక్ష్మి, ప్రధాన కార్యదర్శిగా స్వప్న, కోశాధికారిగా శారదలను అభినందించారు. మాజీ అధ్యక్షురాలు లక్ష్మి, లత, విజయలను సన్మానించారు. కార్యక్రమంలో మహిళా సంఘాల మహిళలు తదితరులు పాల్గొన్నారు.