11-03-2025 07:23:53 PM
బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు నూనె కుమార్ యాదవ్...
కొండపాక: రైతుల సాగునీటి కోసం కొండపాక రాజీవ్ రహదారి దిగ్బంధనానికి, ఈ నెల 13వ తేదీ న పరిమిషన్ ఇవ్వాలని కుకునూరు పల్లి ఎస్ఐ శ్రీనివాస్ కు కొండపాక మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు నూనె కుమార్ యాదవ్ వినతి పత్రం అందించారు. చేతికొచ్చిన పంట నీళ్లు లేక ఎండిపోతుందని గుండెల్లో మంటలు మండుతున్నాయని అన్నారు. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో రైతులను పట్టించుకునే నాధుడే కరువయ్యారని, రైతుల బాధలు తెలియాలంటే కొండపాక మండలంలో రాజీవ్ రహదారిని ఈ నెల 13వ తేదీన రైతులతో కలిసి దిగ్బంధం చేస్తామని, అందుకు పర్మిషన్ ఇవ్వాలని కుకునూరుపల్లి ఎస్ఐ శ్రీనివాస్ కు వినతి పత్రాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ రాగల దుర్గయ్య, దొమ్మాట మైపాల్ రెడ్డి, మాజీ సర్పంచ్ పెద్దం కుల శ్రీనివాస్ గౌడ్, రవీందర్, చిక్కుడు భాను, ఆరెళ్ళ అఖిల్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.