15-05-2025 10:03:35 AM
హైదరాబాద్: అఫ్జల్‌గంజ్(Afzal Gunj) పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం ఉదయం అగ్నిప్రమాదం సంభవించింది. గోల్ మసీదు సమీప భవనంలో మంటలు చెలరేగాయి. భవనం మూడో అంతస్తులో మంటలు(Fire accident) ఎగిరిపడ్డాయి. దీంతో చుట్టుపక్కల నల్లటి పొగ కమ్మేసింది. స్థానికుల సమాచారంతో నాలుగు అగ్నిమాపక యంత్రాలతో ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలార్పుతున్నారు. భవనంలో చిక్కుకున్న ఆరుగురిని ఫైర్ సిబ్బంది కాపాడారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రమాదం ఎలా జరిగిందన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.