15-05-2025 11:31:29 AM
నాగర్ కర్నూల్ (విజయక్రాంతి): బడి పిల్లలను పాఠశాల నుంచి ఇంటికి తరలించేందుకు వినియోగించే ప్రైవేటు బస్సుల యజమానులు నిబంధనలను పాటించకపోతే ఫిట్నెస్ పొందని బస్సులను సీజ్ చేస్తామని ఆర్టీవో బాలు నాయక్ (RTO Balu Nayak)హెచ్చరించారు. ఆర్టీవో కార్యాలయంలో ప్రైవేట్ పాఠశాల యాజమాన్యంతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న సుమారు 60 ప్రైవేటు స్కూల్ బస్సులు అన్ని ఫిట్నెస్ పొందాల్సిందేనని నిబంధనల ప్రకారం తూచా తప్పకుండా పాటించాలన్నారు. వారితోపాటు ప్రైవేటు స్కూల్ ప్రిన్సిపాల్, స్కూల్ బస్ యాజమాన్యం ఉన్నారు.