ఆంజనేయస్వామి ఆలయానికి శంకుస్థాపన
మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌కు నాయకుల ఆహ్వానం
బాన్సువాడ, మార్చి 3 (విజయక్రాంతి): ఆర్టీసీ మాజీ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే, భారత రాష్ట్ర సమితి బాన్సువాడ ఇన్చార్జి బాజిరెడ్డి గోవర్ధన్‌ను మంగళవారం నిజామాబాద్ లోని ఆయన స్వగృహంలో నసురుల్లాబాద్ మండల నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్ మండలంలోని బొప్పస్పల్లి గ్రామంలో ఈ నెల 6వ తేదీ శుక్రవారం ఉదయం 9 గంటల 45 నిమిషాలకు నిర్వహించనున్న ఆంజనేయస్వామి గుడి శంకుస్థాపనతో పాటు లంబాడీల ఆరాధ్య దైవం రామ్ రామ్ మహారాజ్ విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరుకావాలని కోరుతూ ఆహ్వాన పత్రికను అందజేశారు. బీఆర్‌ఎస్ పార్టీ మండల సీనియర్ నాయకులు టేకర్ల సాయిలు, లక్ష్మణ్, చౌహాన్, దొంతి భాస్కర్, మామిడి భూమయ్య, కేతావత్ బాబు, మహేష్ పాల్గొన్నారు.




