24 August, 2026 | 9:57 PM

Breaking News

సంగమేశ్వర స్వామివారిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య   •   గణేష్ మాండపాలకు ఉచిత కరెంటు ఇవ్వాలని వినతి   •   చిరుతపులి చర్మం, గోర్లను అక్రమంగా విక్రయించేందుకు ప్రయత్నించిన నలుగురు వ్యక్తులు అరెస్ట్   •   యంగ్ ఇండియా పాఠశాలను జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయాలి   •   పోచమ్మ దేవత విగ్రహ ప్రతిష్టకు ఆహ్వానం   •   ప్రభుత్వ ఆసుపత్రి డైట్ క్యాంటీన్ ను తనిఖీ చేసిన ఆహార భద్రతా అధికారి జి వరుణ్ రెడ్డి   •   ఆపదలో ఉన్న కుటుంబానికి ఆర్థిక సాయం   •   చిలుకూరును డైరీ హబ్ గా తీర్చిదిద్దాలి   •   గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి పని చేస్తోంది   •   ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి   •  

అభివృద్ధి పనులకు శంకుస్థాపన

24-08-2026 08:54 PM

ముకరంపుర,(విజయక్రాంతి): కరీంనగర్ నగర పాలక సంస్థ 43వ డివిజన్‌లో మున్సిపల్ సాధారణ నిధులతో చేపట్టనున్న సీసీ రోడ్డు, సీసీ డ్రైనేజీ నిర్మాణ పనులకు నగర మేయర్ కొలగాని శ్రీనివాస్  శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మేయర్ కొలగాని శ్రీనివాస్ మాట్లాడుతూ... నగరంలోని అన్ని డివిజన్లలో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. ప్రజలకు మెరుగైన రహదారులు, డ్రైనేజీ సౌకర్యాలు అందించేందుకు అవసరమైన అభివృద్ధి పనులను దశలవారీగా చేపడుతున్నామని పేర్కొన్నారు.

పనుల్లో నాణ్యతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని సంబంధిత అధికారులను, కాంట్రాక్టర్లను ఆదేశించారు. నిర్ణీత గడువులోగా పనులను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు.ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ పొన్నం లక్ష్మి మొండయ్య, కార్పొరేటర్లు తోట అనిల్, APP చంద్ర , ప్రజాప్రతినిధులు, మున్సిపల్ అధికారులు, స్థానిక నాయకులు, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.