భారీగా క్రియాశీల సభ్యత్వం పెరగాలి
- మాజీ ఎమ్మెల్సీ నారదాసు
- బీఆర్ఎస్ సభ్యత్వ సమ్మేళన సమావేశం
బెల్లంపల్లి,(విజయక్రాంతి): బీఆర్ఎస్ కు నూతన జవసత్వం క్రియాశీల సభ్యత్వంతోనే వస్తుందని మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్ రావు అన్నారు. బెల్లంపల్లి బీఆర్ఎస్ కార్యాలయంలో శనివారం బెల్లంపల్లి నియోజకవర్గం బీఆర్ఎస్ కార్యకర్తల సమ్మేళనం సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు దుర్గం చిన్నయ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి టీ బీ జీ కే ఎస్ అధ్యక్షుడు మిర్యాల రాజి రెడ్డి, మాజీ మంచిర్యాల వైస్ చైర్మన్ తొంగల సత్యనారాయణ హాజరయ్యారు.
ఈ సందర్భంగా నారదాసు లక్ష్మణ్ రావు మాట్లాడుతూ పార్టీ సభ్యత నమోదు పూర్తిగా డిజిటల్ పద్ధతిలో జరుగుతుందని తెలిపారు. డిజిటల్ నమోదు వల్ల సభ్యుడు పూర్తి వివరాలు సులభంగా తెలుసుకునే వీలుంటుందన్నారు. దీనికోసం ప్రత్యేకంగా ఒక యాప్ ని రూపొందించడం జరిగిందన్నారు. ఈ యాప్ లో జిల్లా నియోజకవర్గ మండల గ్రామస్థాయిలు వారిగా వివరాలతో పాటు సభ్యుల బ్లడ్ గ్రూప్ పూర్తి చిరునామా కూడా నమోదు చేశాం అని వివరించారు.
గతంలో పుస్తకాల రూపంలో నమోదులో తప్పుడు నివేదికలు జరిగాయని, కనుక అదినేత కేసీఆర్ ఉద్యమకారులు, క్రియశిల నాయకులను ఒక తాటి మీదికి వచ్చి భారీ ఎత్తులో క్రియాశీలన నాయకులు నమోదు చెయ్యాలని,పిలుపునిచ్చారని తెలిపారు. క్రియాశీల సభ్యులకు ఇన్సూరెన్స్ వర్తిస్తుందిన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని సర్పంచులు మాజీ జెడ్పిటిసిలు ఎంపీటీసీలు , సింగిల్ విండో చైర్మన్ మార్కెట్ కమిటీ చైర్మన్ డైరెక్టర్స్ ప్రతి గ్రామ వార్డు సభ్యులు పాల్గొన్నారు.






