24 August, 2026 | 9:13 AM

కేసీఆర్‌ను కలిసిన వంటేరు ప్రతాప్‌రెడ్డి

13-06-2026 08:03 PM

గజ్వేల్: గజ్వేల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్‌చార్జ్, అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ మాజీ వంటేరు ప్రతాప్‌రెడ్డి తన జన్మదినం సందర్భంగా తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావును మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా కేసీఆర్‌కు పుష్పగుచ్ఛం  వంటేరు ప్రతాప్‌రెడ్డి అందజేస ఆయన ఆశీస్సులు పొందారు. పార్టీ బలోపేతం, ప్రజాసేవలో మరింత కృషి చేయాలని కేసీఆర్ సూచించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ప్రతాప్‌రెడ్డితో పాటు అయన కుమారుడు, బూరుగుపల్లి మాజీ సర్పంచ్ వంటేరు విజయవర్ధన్ రెడ్డి కూడా ఉన్నారు. జన్మదినం సందర్భంగా కేసీఆర్‌ను కలవడం తనకు ఆనందంగా ఉందని, ఆయన ఆశీస్సులతో ప్రజలకు మరింత సేవ చేస్తానని వంటేరు ప్రతాప్‌రెడ్డి ఈ సందర్భంగా పేర్కొన్నారు.