ఇంగ్లీష్ వృత్తి నైపుణ్యతపై ఉపాధ్యాయులకు శిక్షణ
13-06-2026 08:17 PM
నేలకొండపల్లి,(విజయక్రాంతి): ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలోని సెయింట్ ఫ్రాన్సిస్ స్కూల్‌లో ఉపాధ్యాయుల కోసం ప్రత్యేక శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యక్తిత్వ వికాస నిపుణులు చెరుకూరి రమేష్ మాట్లాడుతూ 21వ శతాబ్దపు బోధనా నైపుణ్యాలు, కృత్రిమ మేధస్సు (ఏఐ) వినియోగం, ఆధునిక బోధనా పద్ధతులు, కమ్యూనికేషన్ నైపుణ్యాలు, విలువల ఆధారిత విద్యపై అవగాహన కల్పించారు. తర్వాత మాన్విత స్కిల్స్ అకాడమీ నుండి ఫౌండర్ మాన్విత వయసు 8 సం.లు ఉపాధ్యాయులతో ప్రత్యేకంగా సంభాషించి ఇంగ్లీష్ భాషానైపుణ్యాల గురించి ప్రాముఖ్యతను వివరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ బ్రదర్ జోసెఫ్, వైస్ ప్రిన్సిపాల్ మరియాకుమార్ అడ్మినిస్ట్రేటర్ మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.






