26 June, 2026 | 12:51 AM

రైతుల సంక్షేమమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం

26-06-2026 12:05 AM

ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

రూ. 3.12 కోట్లతో మూడు మార్కెట్ షెడ్ల నిర్మాణానికి శంకుస్థాపన 

షాద్ నగర్, జూన్ 25 (విజయక్రాంతి): రైతుల సంక్షేమం, వ్యవసాయ రంగ అభివృ దిే్ధ ధ్యేయంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ స్పష్టం చేశారు. గురువారం షాద్ నగర్ ప్రభుత్వ వ్యవసాయ మార్కెట్ యార్డులో రూ. 3.12 కోట్ల వ్యయంతో నిర్మించనున్న మూడు రై తు ప్రయోజన షెడ్ల పనులకు మార్కెట్ కమిటీ చైర్పర్సన్ సులోచన కృష్ణారెడ్డి, వైస్ చైర్మన్ మొహమ్మద్ అలీ ఖాన్ బాబర్లతో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్ మీడియాతో మాట్లాడుతూ.. గత పాలకులు షాద్ నగర్ మా ర్కెట్ యార్డు అభివృద్ధిని పూర్తిగా నిర్లక్ష్యం చేశారని మండిపడ్డారు. ఇక్కడి మార్కెట్ నుండి కోట్లాది రూపాయల నిధులను సిద్దిపేటకు తరలించారని, ఈ విషయాన్ని తాము అసెంబ్లీలో ప్రస్తావించినా ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.

పంటల కొనుగోలుపై కనీస అవగాహన లేని కొందరు రాజకీయ ప్రయోజనాల కోసం ప్రభుత్వంపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని విమర్శించారు. పంట ధరను నిర్ణయించి, కొనుగోలు చేసేది కేంద్ర ప్రభుత్వమేనని, రాష్ట్ర ప్రభుత్వం కేవలం నిర్వహణ మాత్రమే చూస్తుందనే కనీస జ్ఞానం విమర్శకులకు లేకపోవడం సిగ్గుచేటన్నారు.

మార్కెట్ కమిటీ చైర్పర్సన్ సులోచన కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. రూ. 3.12 కోట్లతో చేపట్టే ఈ మూడు షెడ్ల నిర్మాణాన్ని మూడు నెలల కాలంలో పూర్తి చేస్తామని తెలిపారు. అలాగే త్వరలోనే మరో రూ. 32 లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణ పనులు కూడా చేపట్టనున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో మార్కెట్ సెక్రటరీ వెంకట్ రెడ్డి, డిఈఈ విష్ణువర్ధన్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ బసవేశ్వర్, వైస్ చైర్మన్ అందే మోహన్, కౌన్సిలర్ శిరీష అనిల్ కుమార్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, కమిషన్ ఏజెంట్లు మరియు మార్కెట్ సిబ్బంది పాల్గొన్నారు.