29 June, 2026 | 2:03 AM

ముత్యాలమ్మకు ‘వెంకటగిరి’ బోనాలు

29-06-2026 12:00 AM

ఇనుగుర్తి, జూన్ 28 (విజయక్రాంతి): ఇనుగుర్తి మండలం చిన్ననాగారం మహిమాన్విత చారిత్రక శ్రీ ముత్యాలమ్మ దేవస్థానంలో కొలువై ఉన్న ముగురమ్మలు ముత్యాలమ్మ, మారెమ్మ, పెద్దమ్మ లతోపాటు ఉపాలయంలోని లోతుగుంట మైసమ్మ తల్లులకు కేసముద్రం మండలం వెంకటగిరి గ్రామస్తులు ఆదివారం  ఘనంగా సామూహికంగా బోనాలు సమర్పించారు.

గ్రామస్తులంతా పెద్ద సంఖ్యలో కార్లు, ఆటోలు, ట్రాక్టర్లు, బైకులపై ఇంటిల్లి పాది తరలివచ్చి తమ వాహనాలలో ముత్యాలమ్మ నామ స్మరణ చేస్తూ ప్రదక్షిణలు చేశారు. పట్నాలు వేసి, ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి ఆలయంలోని లోకపావనిలకు అత్యంత భక్తి శ్రద్ధలతో నైవేద్యాలను సమర్పించుకున్నారు. సమృద్ధిగా వర్షాలు కురిసి, పాడి పంటలతో గ్రామాలు విలసిల్లి,అష్ట ఐశ్వర్య ఆయురారోగ్యాలతో ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని వేడుకున్నారు. అంతకమునుపు జగజ్జనని లకు పొట్టేలు కోళ్లతో మొక్కులు చెల్లించుకున్నారు.