5 May, 2026 | 7:03 PM

Breaking News

కలెక్టర్‌ను కలిసిన డీఎఫ్ఓ బాలమణి   •   భారతీయ సంస్కృతిని గౌరవించే పౌరులను తయారు చేయడమే బాలమంగళం లక్ష్యం   •   జిల్లా రెడ్ క్రాస్‌ సొసైటీని బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి   •   సిబ్బంది సమయపాలన పాటించాలి: జిల్లా కలెక్టర్ హరిత   •   ఈఎంఆర్ఎస్ లో 11వ తరగతిలో దరఖాస్తులకు ఆహ్వానం   •   సిరిసిల్ల పిఏసీఎస్ పాలకవర్గం బాధ్యతల స్వీకారం   •   ఎలక్ట్రానిక్ ఓటింగ్ గోదాం వద్ద పటిష్ట భద్రత: కలెక్టర్ హరిత   •   సహకార సంఘాల పాత పాలకవర్గం సభ్యులు తిరిగి బాధ్యతలు స్వీకరణ   •   ప్రధాని నరేంద్ర మోడీ బహిరంగ సభకు సంపూర్ణ మద్దతు   •   అడవుల సంరక్షణలో సిబ్బంది కార్యోన్ముఖులు కావాలి: డీఎఫ్ఓ బాలమణి   •  

గంజాయి రవాణా చేస్తున్న నలుగురి అరెస్ట్

12-09-2024 12:00 AM

కొండపాక, సెప్టెంబర్ 11: గంజాయి రవాణా చేస్తున్న నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వివరా లిలా ఉన్నాయి.. పొన్నాల గ్రామం నుంచి సిద్దిపేట వైపు రెండు బైక్‌లపై నలుగురు యువకులు గంజాయి సరఫరా చేయడానికి వస్తున్నారనే సమాచారం అందడంతో త్రీటౌన్ ఇన్‌స్పెక్టర్ విద్యాసాగర్ సిబ్బందితో కలిసి ఇందుర్ కాలేజీ వద్ద వాహనాల తనిఖీ చేపట్టారు. పోలీసులను చూసి న యువకులు పారిపోయేందుకు ప్రయత్నించగా వెంబడించి పట్టుకున్నారు. వారిని తనిఖీ చేయగా 50 గ్రాముల గంజాయి ప్యాకెట్లు లభ్యమయ్యాయి. గంజాయితో పాటు 4 సెల్ ఫోన్లు, రెండు బైక్‌లు స్వాధీనం చేసుకొని నలుగురిని అరెస్ట్ చేశారు. పట్టు బడిన వారిని నాచారం సాయికుమార్, కోటగల్ల ఆదర్శ్, తలారి రాకే ష్, దయ్యాల శ్రీకాంత్‌గా గుర్తించారు.  

ఎల్బీ నగర్‌లో.. 

ఎల్బీనగర్: నగరంలోని రాజేంద్రనగర్‌లో నివాసం ఉంటున్న మహ్మద్ బషీర్ అలియాస్ ఫైజల్ అలియాస్ సైఫాన్  సులభంగా డబ్బులు సంపాదించడానికి గంజాయి విక్రేతగా మా రాడు. బుధవారం ఎల్బీనగర్‌లోని ఎన్టీఆర్ కూరగాయల మార్కెట్ వద్ద గంజాయి విక్రయించడానికి ప్రయత్నించగా, విశ్వసనీయ సమాచారంతో ఎల్బీనగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడి నుంచి 18 గ్రాముల గంజాయిను స్వాధీనం చేసుకొని, కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.