24 May, 2026 | 1:26 AM

వడదెబ్బతో నలుగురు మృతి

24-05-2026 12:05 AM

కొనసాగుతున్న తీవ్రమైన ఎండలు, వడగాలులు

18 జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ

బెల్లంపల్లి/సుల్తానాబాద్/ఉట్నూర్/మధిర(విజయకాంతి) : రాష్ట్రంలో ఎండలు మం డిపోతున్నాయి. పలు జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో జనం పి ట్టల్లా రాలిపోతున్నారు. ఇప్పటి వరకు తెలంగాణలో వడదెబ్బతో 34 మంది మరణించి నట్లు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. శనివారం ఒక్కరోజే పలు ప్రాంతాల్లో నలుగురు వడదెబ్బకు గురై మృతి చెందారు. పగ టిపూట బయటకు రావాలంటేనే ప్రజలు భ యపడి ఇళ్లకే పరిమితమవుతున్నారు.

వాతావరణ శాఖ రాష్ట్రంలోని 18 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేయడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. మంచిర్యాల జిల్లాలోని బెల్లంపల్లి పట్టణం పెద్దనపల్లికి చెందిన పోలగాని వెంకటేష్ బర్రెలను మేపేందుకు వెళ్లి తిరిగి ఎండ వేళ్లప్పుడు ఇంటికి చేరుకున్నాడు. అప్పటికే అతను తీవ్ర అస్వస్థతకు గురికాగా కుటుంబ సభ్యులు బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి హుటాహుటినా తీసుకెళ్లారు. వైద్యులు చికి త్స అందించినప్పటికీ వెంకటేష్ మృతి చెం దాడు.

పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపల్ ఆరో వార్డు సుభాష్ నగర్‌కు చెందిన న్యాతరి మొండయ్య (76) వడదెబ్బతో మృతి చెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న తన తండ్రి ఇంటి లోనే ఉంటూ తీవ్ర ఎండ వేడిమి తట్టుకోలేక మృతి చెందినట్లు మొండయ్య కుమారుడు మహేష్ తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండల కేంద్రానికి చెందిన బిలాల్ ఫా రుక్ (38) అనే వ్యక్తి వడదెబ్బతో మృతి చెం దారు.

మహారాష్ట్రలోని కిన్వట్ తాలూకా గుట్టి గ్రామానికి పని నిమిత్తం వెళ్లారు. శనివారం వడదెబ్బ బారిన పడిన మృతి చెంది నట్లు బిలాల్ బంధువులు తెలిపారు. అటు వైద్యులు సైతం బిలాల్ వడదెబ్బతోనే మృ తి చెందినట్లు నిర్ధారించారు. ఖమ్మం జిల్లా మధిర మండలం ఇల్లూరు గ్రామానికి చెం దిన కోట నిరంజన్ వడదెబ్బతో మృతి చెం దాడు.

గత ఆదివారం నందిగామ మండలం తక్కెలపాడు,వీర్లపాడు గ్రామాల చెందిన బంధువులు మృతి చెందడంతో అక్కడికి వెళ్లి ఎండ వేళప్పుడు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇంటికి వచ్చిన నిరంజన్ అస్వస్థ తకు గురయ్యాడు.వెంటనే ఆయన్ని ఖమ్మం ఆసుపత్రికి తరలించగా, వడదెబ్బ తీవ్రంగా తగలడంతో బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినట్లు వైద్యు లు నిర్ధారించారు. నిరంజన్‌కు భార్య, ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు.