14 August, 2026 | 9:48 PM

ప్రమాద బీమా చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

14-08-2026 08:45 PM

ఎల్లారెడ్డి,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో విద్యుత్ ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రభుత్వం అందిస్తున్న రూ.5,00,000 ప్రమాద బీమా  చెక్కులను ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ బాధిత కుటుంబాలకు శుక్రవారం అందజేశారు. ఈ సందర్భంగా లింగంపల్లి కలాన్‌ అల్లాపురం లక్ష్మి , మాచాపూర్‌ కొండా సునీత , సాతేల్లి ఎర్కల రవి లకు ప్రమాద బీమా చెక్కులను ఎమ్మెల్యే ప్రమాదవశాత్తు కుటుంబ సభ్యులను కోల్పోయిన కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తూ, ఆర్థిక భరోసా కల్పించడం అభినందనీయమని ఎమ్మెల్యే మదన్మోహన్ తెలిపారు.