ద్విచక్ర వాహనాలు ఢీకొని నలుగురికి గాయాలు
29-08-2026 09:59 PM
మహా ముత్తారం,(విజయక్రాంతి): జయశంకర్ జిల్లా మహా ముత్తారం మండలం నిమ్మగూడెం గ్రామంలోని రహదారి మూల మలుపు వద్ద శనివారం నాడు రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో నిమ్మగూడెం గ్రామానికి చెందిన తడన్ల కృష్ణవేణి సాహిత్య కనుకునూరు గ్రామానికి చెందిన కుడుముల సాయికిరణ్ యానక రాజకుమారులు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే 108లో భూపాలపల్లి వంద పడకల ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదం పట్ల కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మహా ముత్తారం పోలీసులు తెలిపారు.






