సోయాబీన్–కంది అంతర పంటపై క్షేత్ర ప్రదర్శన
29-08-2026 10:25 PM
రామారెడ్డి,(విజయక్రాంతి): రామారెడ్డి మండలం మద్దికుంట గ్రామంలో సోయాబీన్–కంది అంతర పంట సాగుపై ATMA ఆధ్వర్యంలో క్షేత్ర ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా సోయాబీన్‌తో కందిని అంతర పంటగా సాగు చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు, పంటల నిష్పత్తి, విత్తన మోతాదు, పంట యాజమాన్య పద్ధతులపై రైతులకు ఏవో భానుశ్రీ అవగాహన కల్పించారు.
అంతర పంట విధానంతో భూమి, నీరు, వనరులను సమర్థవంతంగా వినియోగించుకోవడంతో పాటు పంటల వైవిధ్యాన్ని పెంచి అధిక దిగుబడి, అదనపు ఆదాయం పొందవచ్చని అధికారులు వివరించారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, ఉపసర్పంచ్, MAO, AEOతో పాటు రైతులు పాల్గొన్నారు.






