29 August, 2026 | 10:50 PM

ఉత్తమ అవార్డు గ్రహీత ఫీల్డ్ అసిస్టెంట్ వెంకటస్వామికు సన్మానం

29-08-2026 10:17 PM

అక్కన్నపేట,(విజయక్రాంతి): అక్కన్నపేట మండలం గౌరవెల్లి గ్రామ ఫీల్డ్ అసిస్టెంట్ వెంకటస్వామికి జిల్లా ఉత్తమ ఫీల్డ్ అసిస్టెంట్ అవార్డు రావడంతో ఆయనకు గ్రామంలోని యువత శనివారం సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గ్రామ సర్పంచ్ పాండ్రాల దాము హాజరై ఫీల్డ్ అసిస్టెంట్ కు సన్మానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఫీల్డ్ అసిస్టెంట్ గా వెంకటస్వామి సేవలు మరువలేనివని, కష్టపడితే ఫలితం తప్పకుండా ఉంటుందని నిరూపించిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు.

ఆయన అనారోగ్యంతో ఉన్న పని విషయంలో ఎక్కడా తగ్గలేదని సూచించారు. ప్రతిభ ఉన్నవారిని ప్రభుత్వం తప్పకుండా గుర్తిస్తుందని తెలియజేశారు. అనంతరం ఫీల్డ్ అసిస్టెంట్ వెంకటస్వామి మాట్లాడుతూ నాకు అవార్డు రావడం చాలా ఆనందాన్నిచ్చిందన్నారు. కానీ నాపై మరింత బాధ్యతను పెంచిందని తెలియజేశారు. రాబోవు రోజుల్లో మరింత నిబద్ధతతో పనిచేసి గ్రామానికి మంచి పేరు తీసుకువస్తానని అన్నారు.