1 April, 2026 | 10:36 PM

నాలుగు లేబర్ కోడ్ లను వెనక్కి తీసుకునేవరకు ఉద్యమిస్తాం

01-04-2026 08:50 PM

సిఐటియు మండల కన్వీనర్ మురహరి రఘు

దమ్మపేట,(విజయక్రాంతి): బిజెపి ప్రభుత్వం తీసుకొస్తున్న నాలుగు లేబర్ కోడ్ లను వెనక్కి తీసుకునే వరకు ఉద్యమిస్తామని సిఐటియు మండల కన్వీనర్ మురహరి రఘు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. బుధవారం దేశవ్యాప్తంగా కార్మిక సంఘాల ఆధ్వర్యంలో బ్లాక్ డే సందర్భంగా దమ్మపేట రహదారిపై ప్లకార్డులతో నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా మురహరి రఘు మాట్లాడుతూ కేంద్రం లోని బిజెపి ప్రభుత్వం అధికారాల్లోకి వచ్చిన తర్వాత కార్మికుల పట్ల నిరంకుశ వైఖరిని అవలంబిస్తుందని, బిజెపి ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్ లను రద్దు అయ్యేవరకు శ్రామిక వర్గం ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. నాలుగు లేబర్ కోడ్ లు కార్మికులకు శాపంగా మారాయని, కార్మిక హక్కులను కాలరాసే నాలుగు లేబర్ కోడ్లను తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు రజిని, సంధ్య, కార్తీక్, ఈశ్వరమ్మ, రమణ తదితరులు పాల్గొన్నారు.