18 April, 2026 | 2:23 AM

హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసిన ఎమ్మెల్యేలు

16-06-2025 01:25 PM

హైదరాబాద్: తెలంగాణ హైకోర్టు(Telangana High Court)లో నలుగురు ఎమ్మెల్యేలు ప్రజాప్రయోజన వ్యాజ్యం(Public Interest Litigation) దాఖలు చేశారు. ఖాజాగూడలోని ప్రభుత్వ భూమి ఆక్రమణ(Encroachment Of Government Land)కు గురైందంటూ ఎమ్యెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి, రాజేష్ రెడ్డి, అనిరుద్ రెడ్డి, మురళి నాయక్  పిల్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై సీనియర్ న్యాయవాది చిక్కుడు ప్రభాకర్(Senior Advocate Rikudu Prabhakar) వాదనలు వినిపించారు. ఖాజాగూడలోని సర్వే నం.199, 122లో 27.18 ఎకరాల భూమిని ఆక్రమించారని, సర్వే నంబర్ మార్చి పోరంబోక్ భూమిని ఆక్రమించారని న్యాయవాది ప్రభాకర్ వెల్లడించారు.

ఖాజాగూడలోని ఆక్రమించిన భూమి విలువ రూ.10 వేల కోట్లు ఉంటుందన్నారు. రంగారెడ్డి కలెక్టర్ 2023లో నిరభ్యంతర పత్రం జారీ చేశారని, ఎన్వోసీతో జీహెచ్ఎంసీ భవన నిర్మాణాలకు అనుమతి ఇచ్చిందని న్యాయవాది పేర్కొన్నారు. ప్రస్తుతం ఆ స్థలంలో 8 టవర్లు నిర్మిస్తున్నారని, అలాగే ఖాజాగూడ చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మాణాలున్నాయని ప్రభాకర్ కోర్టుకు వివరించారు. ఆక్రమణకు గురైన ఖాజాగూడ భూమిని స్వాధీనం చేసుకునేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని న్యాయస్థానాన్ని విజ్ఞప్తి చేశారు. సీఎస్, ప్రతివాదులకు మళ్లీ వినతిపత్రం ఇవ్వాలని పిటిషనర్లుకు హైకోర్టు సూచించింది. తదుపరి విచారణ రెండు వారాలకు వాయిదా వేస్తూ హైకోర్టు సీజే ధర్మాసనం జారీ చేసింది.