31 August, 2026 | 6:00 PM

Breaking News

పాము కాటుకు నాలుగేళ్ల బాలుడు మృతి

26-06-2025 08:30 PM

మహబూబాబాద్ (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా(Mahabubabad District) మరిపెడ మండలం దంటకుంట తండాలో పాము కాటుకు గురై నాలుగేళ్ల బాలుడు గుగులోతు రంజిత్ మరణించాడు. బుధవారం రాత్రి ఇంట్లో తల్లిదండ్రులతో కలిసి నేలపై నిద్రిస్తుండగా రంజిత్ ను నాలుగు చోట్ల పాము కాటు వేసింది. దీనితో బాలుడు లేచి ఏడవడంతో వెంటనే పాముకాటు వేసినట్లు గుర్తించిన తండ్రి రమేష్ హుటాహుటిన బాలున్ని ఖమ్మం తీసుకువెళ్లాడు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి గురువారం రంజిత్ మరణించాడు. ఈ విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే డీ ఎస్ రెడ్యానాయక్ బాధిత కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చరు. 

హాస్టల్లో తాచుపాము కలకలం

మహబూబాబాద్ లోని మెడికల్ కళాశాల బాలుర వసతి గృహంలో బుధవారం రాత్రి తాచుపాము హల్చల్ చేసింది. హాస్టల్ లోకి తాచుపాము రావడానికి చూసిన విద్యార్థులు వెంటనే స్నేక్ స్నాచర్ ఇమామ్ కు సమాచారం ఇవ్వడంతో ఆయన హాస్టల్ కు వచ్చి  చాకచక్యంగా పామును పట్టుకుని అడవిలో వదిలిపెట్టాడు. విద్యార్థుల అప్రమత్తతతో పెద్ద ప్రమాదం తప్పిపోయింది.