రైతులు సంఘటితంగా ఎఫ్పీఓలో భాగస్వాములు కావాలి

15-09-2026 | 08:18pm

ఎఫ్పీఓ ఎక్స్ పర్ట్ అలీ హుస్సేన్

నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): మండలంలోని తాండూర్ కిచ్చన్నపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం(Primary Agricultural Cooperative Society) పరిధిలోని కిచ్చనపేట పీఏసీఎస్‌లో ఎఫ్‌పీఓ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఉత్సాహంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులకు ఎఫ్‌పీఓ ద్వారా కలిగే ప్రయోజనాలను ఎఫ్‌పీఓ ఎక్స్‌పర్ట్ అలీ హుస్సేన్(FPO Expert Ali Hussain) వివరించారు. రైతులు ఎఫ్‌పీఓలో సభ్యులుగా చేరే సమయంలో ₹2,000 వాటా నగదును చెల్లిస్తే, ప్రభుత్వం అదనంగా ₹2,000 మ్యాచింగ్ గ్రాంట్‌గా అందిస్తుందనీ తెలిపారు.

దీంతో ఒక్కో సభ్యునికి మొత్తం ₹4,000 వాటా మూలధనం సమకూరుతుంది. ఈ విధంగా రైతులు ఎఫ్‌పీఓలో భాగస్వాములుగా మారడంతో పాటు, భవిష్యత్తులో ఎఫ్‌పీఓ అభివృద్ధి మరియు వ్యాపార కార్యకలాపాల్లో భాగస్వామ్యం పొందే అవకాశం ఉంటుంది. రైతులు సంఘటితంగా ఎఫ్‌పీఓలో భాగస్వాములు కావడం ద్వారా విత్తనాలు, ఎరువులు, వ్యవసాయ పనిముట్లను తక్కువ ధరలకు పొందడంతో పాటు, నేల పరీక్షలు,పంటల సాగుపై సాంకేతిక సలహాలు, ఉత్పత్తులకు మెరుగైన మార్కెట్ ధరలు పొందే అవకాశం ఉంటుందని తెలిపారు.

అలాగే ఎఫ్‌పీఓ ద్వారా ప్రభుత్వ పథకాలు(Government schemes), రుణ సదుపాయాలు,నిల్వ, ప్రాసెసింగ్, విలువ జోడింపు, సమిష్టి మార్కెటింగ్ వంటి అవకాశాలను రైతులు వినియోగించుకోవచ్చని వివరించారు. ఇప్పటికే సభ్యత్వం పొందిన రైతులకు ఎఫ్‌పీఓ షేర్ సర్టిఫికెట్లను పంపిణీ చేశారు. ప్రస్తుతం కిచ్చనపేట సొసైటీలో 550 మంది రైతులు ఎఫ్‌పీఓ సభ్యత్వం పూర్తి చేసుకోగా,మరో 200 మంది రైతులను సభ్యులుగా చేర్చాల్సి  ఉందడి తెలిపారు. కావున తాండూర్ సొసైటీ కిచ్చన్నపేట ప్రాథమిక సహకార సంఘం పరిధిలోని మిగిలిన రైతులు ఎఫ్పిఓలో సభ్యులుగా చేరి రైతుల సమిష్టి శక్తిని బలపేతం చేయాలని తెలిపారు.

మరిన్ని వార్తలు