26 June, 2026 | 6:46 PM

Breaking News

ఐకేపీ వీఓఏలను సెర్ఫ్ ఉద్యోగులుగా గుర్తించాలి   •   టీపీసీసీ ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శిగా ఆరెపల్లి రాహుల్   •   నిర్మల్ పోలీస్... మీ పోలీస్...   •   బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడిగా రాపాక ప్రవీణ్ నియామకం   •   డబుల్ లైన్ రోడ్ నిర్మాణ పనులను ప్రారంభించిన చైర్మన్ బిరుదు రాధాకృష్ణ   •   సుల్తానాబాద్ లో వైభవంగా మొహరం వేడుకలు   •   ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పై అసత్య ఆరోపణలు చేస్తే సహించేది లేదు: కాంగ్రెస్ హెచ్చరిక   •   యూరియా యాప్ రద్దు చేసి రైతులకు నేరుగా పంపిణీ చేయాలి   •   హరీష్ రావుకు ఆహ్వాన పత్రిక అందజేత   •   టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్.. వైభవ్‌కు దక్కని చోటు   •  

ఎస్బీఐలో మోసం.. నలుగురు అరెస్ట్

22-04-2026 12:46 AM

వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్

నల్గొండ, ఏప్రిల్ 21(విజయక్రాంతి): నల్గొండ దేవరకొండ పట్టణ పరిధిలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అగ్రికల్చర్ కమర్షియల్ బ్రాంచ్‌లో జరిగిన ఆర్థిక మోసం కేసులో నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ.2.65 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నారు.

జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ మంగళవారం తన కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఈ మోసానికి సంబంధించిన విషయాలను వెల్లడించారు. దేవరకొండ ఎస్బీఐ బ్రాంచ్ కాంట్రాక్టు హౌస్ కీపింగ్ ఉద్యోగి లెండల చక్రపాణి ఇనాక్టివ్ ఖాతాలను దుర్వినియోగం చేసి రూ. 2,65,55,268లను బదిలి చేసినట్లు మేనేజర్ ఫణీంద్ర నీలకంఠ వెంకట రాఘవపూడి ఫిర్యాదు చేశారని తెలిపారు. కేసు నమోదు చేసి ఘటనతో సంబంధం ఉన్న నలుగురిని విచారించగా నేర విధానం మొత్తం బయటికొ చ్చిందన్నారు.

ఇనాక్టివ్ ఖాతాలను అప్ డేట్ చేసి వారి ఖాతాల నుంచి డబ్బును ఇతరుల ఖాతాలకు మళ్లించేవాడని గుర్తించినట్లు చెప్పారు. నిందితునికి సహాయం చేసిన వారిలో ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్ బ్యాంక్ మేనేజర్ పుట్ట వెంకట రామాంజనేయులు, కేతావత్ రాంలాల్, మారేపల్లి శివలను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. కేసును చేధించిన దేవరకొండ డీఎస్పీ శ్రీనివాస్, సీఐ పీ వెంకట్ రెడ్డి, ఎస్‌ఐ రాజు, కానిస్టేబుళ్లు వీరబాబు, ఫయాజ్, చాంద్ పాషా, వీ సింహాద్రి, హోం గార్డ్ సోమ్లాలను ఎస్పీ శరత్ చంద్ర పవాన్ అభినందించారు.