02-06-2025 10:13:18 PM
బెస్ట్ అవైలబుల్ స్కూల్ పథకానికి ఈనెల 15తో ముగియనున్న దరఖాస్తులు అవకాశం..
భద్రాచలం (విజయక్రాంతి): భద్రాచలం పట్టణంలోని లిటిల్ ఫ్లవర్స్ విద్యాసంస్థలలో ఎస్సీ, షెడ్యూల్ కులాల విద్యార్థులకు బెస్ట్ అవైలబుల్ స్కూల్ పథకం క్రింద ఉచిత ప్రవేశానికి ఈ నెల 15 తారీకు వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం విద్య శాఖ అధికారులు కల్పించారు. 2025-2026 విద్యా సంవత్సరం గాను హాస్టల్ వసతితో 69 సీట్లు, నాన్ రెసిడెన్షియల్ డే/ కాలర్ కేవలం భద్రాచలం మండలం చెందిన విద్యార్థులకు మాత్రమే 22 సీట్లు ఖాళీగా ఉన్నాయి. ఈనెల 15 తారీకు సాయంత్రం ఐదు గంటలలో వరకు దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పించారు. ఆసక్తి గల విద్యార్థులు మీసేవ నుండి జారీ చేయబడిన జనన ధ్రువీకరణ పత్రంతో పాటు కుల నివాస ఆదాయ నకలు పత్రాలు తల్లితండ్రులతోపాటు విద్యార్థి ఆధార్ కార్డు జిరాక్స అందజే జత చేయాల్సి ఉంటుంది.
అదేవిధంగా ఒకటవ తరగతి ప్రవేశం కోసం దరఖాస్తు చేసుకునే విద్యార్థులు యూకేజీ పూర్తి అయిన ప్రోగ్రెస్ కార్డు బోనఫైడ్ సర్టిఫికెట్లను కూడా అందించాల్సి ఉంటుంది. జూన్ ఒకటో తారీకు నాటికి ఐదు సంవత్సరాల్లో వయసు కలిగి ఉండాలన్నారు. అదేవిధంగా ఐదో తరగతిలో ప్రవేశించే విద్యార్థులకు నాలుగో తరగతి ప్రోగ్రెస్ కార్డుతో పాటు బోనఫైడ్ సర్టిఫికెట్ రెండు కలర్ పాస్ ఫోటోలు జత చేసి ఈ నెల 15 తారీకు సాయంత్రం ఐదు గంటల లోపు మెడికల్ కాలనీలోని లిటిల్ ఫ్లవర్స్ విద్యా సంస్థలలో , షెడ్యూల్ కులాల అభివృద్ధి అధికారి కార్యాలయంలో అందించాల్సి ఉంది. నాణ్యమైన విద్యను అందిస్తున్న లిటిల్ ఫ్లవర్స్ విద్యా సంస్థలలో ఉచితంగా విద్యను పొందేందుకు రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని షెడ్యూల్ కులాలకు చెందిన ఎస్సీ విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలనీ కోరారు.