02-06-2025 10:15:36 PM
కొత్తగూడెం (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర సబ్ జూనియర్ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్-2025(Telangana State Sub-Junior Athletics Championships) పోటీల్లో భద్రాద్రి న్యూ స్టార్స్ అథ్లెటిక్స్ క్లబ్ క్రీడాకారిణి ప్రతిభ చాటారు. ఆదివారం సికింద్రాబాద్ జింకానా క్రీడా మైదానంలో ముగిసిన ఈ పోటీల్లో షాట్ పుట్ విభాగంలో బంగారు పతకం కైవసం చేసుకున్నారని న్యూ స్టార్ క్లబ్ ప్రెసిడెంట్ జాతీయ క్రీడాకారుడు మహమ్మద్ బాబ్జి తెలియజేశారు. ఈ సందర్భంగా భద్రాద్రి జిల్లా సెక్రెటరీ మహిధర్ యువజన క్రీడల అధికారి ఎం.పరందామరెడ్డి, జిల్లా తడిక అసోసియేషన్ సెక్రటరీ కే.మహిదర్ రాష్ట్ర అథ్లెటిక్స్ అసోసియేషన్ సెక్రటరీ జె.సారంగపాణి, కోచ్లు డి.మల్లిఖార్జున్, సుష్మ భాయ్, వంశీ క్రీడాకారునికి ప్రత్యేకంగా అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.