యూరియా కోసం సొసైటీకి తాళం.. రైతుల ఆందోళన
13-08-2026 07:12 PM
గంభీరావుపేట,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం కొత్తపల్లి గ్రామంలో యూరియా అందుబాటులో లేక రైతులు సింగిల్ విండో కార్యాలయానికి తాళం వేసి ఆందోళన చేపట్టారు. ఫర్టిలైజర్ యాప్‌లో యూరియా బుక్ కావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మధ్యాహ్నం 3 గంటలకు యూరియా అందుబాటులో ఉందని అధికారులు తెలిపినా, యాప్‌లో బుకింగ్ కాకపోవడంతో రైతులు కార్యాలయం ముందు బైఠాయించి ధర్నా నిర్వహించారు. అధికారుల నిర్లక్ష్యంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు. పంటలకు సరిపడా యూరియా దొరకడం లేదని, టెక్నాలజీ వల్ల సౌలభ్యం కాక ఇబ్బందులు పెరుగుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. యాప్ విధానాన్ని రద్దు చేసి యూరియాను నేరుగా అందించాలని డిమాండ్ చేశారు.






