15 July, 2026 | 7:12 PM

దివ్యాంగులకు సేవచేసే అవకాశం జీవితంలో మహద్భాగ్యం: కూనంనేని

15-07-2026 07:10 PM

కొత్తగూడెం,(విజయక్రాంతి): దివ్యాంగులకు సేవచేసే అవకాశం జీవితంలో మహద్భాగ్యం అని కూనంనేని సాంబశివరావు ఎమ్మెల్యే కొత్తగూడెం అన్నారు. ఈ రోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సర్వశిక్షాభియాన్,  అలింకో  ఆధ్వర్యంలో దివ్యాంగులకు ఉచితంగా, ఉపకరణాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని స్థానిక ఎమ్మెల్యే మాట్లాడుతూ, దివ్యాంగులకు మనం చేసే సేవ చాలా తక్కువ అని , వారి చేయూతకు అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. ఈ సందర్భం గా పంపిణీ చేస్తున్న ఉపకరణాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

కొత్తగూడెం మేయర్ మూడ్ గణేష్  మాట్లాడుతూ, దైవసమానులైన దివ్యాంగులకు ఉచితంగా ప్రభుత్వం, అలింకో అందిస్తున్న ఈ సేవలను మరింత విస్తృతంగా అందుబాటులోకి తీసుకురావాలని అన్నారు.  స్థానిక కార్పొరేటర్ ఆకాంక్ష , కొత్తగూడెం చుంచుపల్లి , సుజాతనగర్ , లక్ష్మీదేవిపల్లి, పాల్వంచ మండలాల  విద్యా శాఖాధికారులు, ఐఈఆర్పిలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి కొత్తగూడెం, ఎంఈఓ  మధురవాణి అధ్యక్షత వహించగా ఐఈఆర్పి శ్రీరామ్ కార్యక్రమానికి  సారధ్యం  వహించారు. ఈ ఐదు మండలాలనుండి  దాదాపు, వంద మంది దివ్యాంగవిద్యార్థుల వారి తల్లిదండ్రులతో పాల్గొని ఉపకరణాలు స్వీకరించినారు .