30 April, 2026 | 12:07 PM

పోలీసుల ఆధ్వర్యంలో చలివేంద్రాలు ప్రారంభం

30-04-2026 11:03 AM

గుండాల,(విజయక్రాంతి): జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఆదేశానుసారం మండల కేంద్రంలోని పస్రా క్రాస్ రోడ్డు, ప్రధాన కూడలిలో రెండు చలివేండ్రాలను మండల పోలీస్ సిబ్బంది ఆధ్వర్యంలో గురువారం ఏర్పాటు చేశారు. ఈ చలివేండ్రాలను స్థానిక సీఐ తిరుపతి, ఎంపీడీవో బాలరాజు లు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. మండలంలో పెరుగుతున్న ఎండల దృష్టా మండలవాసులు ఈ చలివేండ్రాలను వినియోగించుకోవాలని వారు ఈ సందర్భంగా కోరారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది మంగయ్య, రాంకీ, గామాలపాటి నగేష్, స్థానికులు, పాత్రికేయులు తదితరులు పాల్గొన్నారు.