30 April, 2026 | 12:15 PM

తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దుల్లో పులి సంచారం

30-04-2026 10:58 AM

బోథ్,(విజయక్రాంతి): బోథ్ రేంజి పరిధిలోని మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న కైలాస్ టేకిడి గుట్టల్లో గురువారం ఉదయం పెద్దపులి సంచరించింది. నేరడిగొండ మండలంలోని దర్భ తాండకు చెందిన వారు నాందేడ్ ఈ అటవీ మార్గంలో వెళుతుండగా ఉదయం నాలుగు గంటలకు పులి రోడ్డు దాటుతూ కనిపించినట్లు తెలిపారు. తాము వెళ్తున్న కారుకు 60 మీటర్ల దూరంలో పులి కనబడడంతో ఒకేసారి వనికి పోయామని చేరుకొని వీడియోలు తీయడం జరిగిందని పేర్కొన్నారు. ఏది ఏమైనా మహారాష్ట్ర తెలంగాణ అడవుల్లో గత మూడు సంవత్సరాల కాలంగా మకాం వేసిన పులి సంచరిస్తుండడంతో స్థానికులు ఆందోళన చేస్తున్నారు.