16 March, 2026 | 11:11 PM

Breaking News

9వ డివిజన్ మేడిపల్లి కాలనీల సమస్యలను వెంటనే పరిష్కరించాలి   •   ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దురాక్రమణ దాడి ఆపాలి   •   కరీంనగర్ రూరల్ తహశీల్దార్‌ను కలిసిన టీఎన్జీవో, టిజీవో నాయకులు   •   విద్యార్థుల స్కాలర్షిప్ & ఫిజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయాలి   •   ఎమ్మెల్యే మందుల సామేలు ఇంటి ముట్టడి.. గుడ్లు, టమాటలతో దాడి   •   రాష్ట్ర బడ్జెట్‌లో విద్యకు నిధులు కేటాయించాలి   •   సమస్య విన్నారు.. పరిష్కారానికి హామీ ఇచ్చారు   •   ప్రాణాపాయ స్థితిలో ఉన్న జీవం పోసిన పశువైద్యాధికారి   •   దోమకొండకు నిధులు మంజూరు   •   అనారోగ్యంతో బాధపడుతున్న యువకుడికి అండగా నిలిచిన ప్రభుత్వ విప్   •  

భవిత సెంటర్‌లో ఉచిత వైద్యశిబిరం

04-12-2025 12:00 AM

ముఖ్య అతిథులుగా ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ కోర్టు జడ్జి ఎస్.శిరీష

చిట్యాల, డిసెంబర్ 3(విజయ క్రాంతి): రామన్న పేట మండల కేంద్రంలో గల భవిత సాహితీ విద్య వనరుల కేంద్రం నందు జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ అదేశాలనుసారం, మండల న్యాయ సేవా అధికార సంస్థ రామన్నపేట అధ్వర్యంలో మండల విద్యాధికారి గవ్వ జ్యోతి సమక్షంలో, ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి రామన్నపేట డాక్టర్లు వరుణ్ రెడ్డి, ఉదయ్ లు కలిసి ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు.

ఉచిత వైద్య శిబిరం కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా  ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ కోర్టు జడ్జి ఎస్.శిరీష హాజరై మాట్లాడుతూ ఈ కేంద్రం నందు ఉన్న వారందరికీ ఇక్కడ అందించే సేవలు మరువలేనివి, మనం ఎంత చేసిన తక్కువనే అన్నారు. ఈ వైద్య శిబిరం నందు మొత్తం 20 మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం వారికి పండ్లు, బహుమతులు అందజేశారు.

ఈ కార్యక్రమంలో భవిత కేంద్రాల జిల్లా ఇన్చార్జి లింగా రెడ్డి, ప్రాథమికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్, లీగల్ సర్వీసెస్ టీమ్ సభ్యులు బత్తుల గణేష్, కానుగంటి శ్రీశైలం, రిసోర్స్ పర్సన్ జంగమ్మ, ఫిజియథెరపీస్ట్ శ్వేత, షఫీ, వైద్య సిబ్బంది సిస్టర్స్ బూపాల, సబిత, హనుమాన్ ప్రసాద్, విద్యార్థుల తల్లిదండ్రులు రేవతి, కవిత, బి.రేవతి, మమత, షమీమ్, పోలిస్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.