calender_icon.png 4 December, 2025 | 3:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా మహా పడిపూజ మహోత్సవం

04-12-2025 12:00:00 AM

శేరిలింగంపల్లి, డిసెంబర్ 3 (విజయక్రాంతి): మియాపూర్ డివిజన్ పరిధిలోనీ ఎంఏ నగర్,హనుమాన్ టెంపుల్ వద్ద బచ్చలి శ్రీనివాస్ (టిప్పర్ శ్రీను) ఆధ్వర్యం లో అరుణ్ గురు స్వామి కరకమలము లచే బుధవారం శ్రీశ్రీశ్రీ అయ్యప్ప స్వామి వారి 18వ మహా పడిపూజ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సంద ర్బంగా అరుణ్ గురు స్వామి మాట్లాడుతూ మండల దీక్ష అనేది ఒక ఆధ్యాత్మిక సాధన అని, దీనిలో భక్తులు 41 రోజులు కఠినమైన నియమ నిష్టలతో పాటించడం ద్వారా మనసును పునీతం చేసుకుంటారని అన్నారు.

అయ్యప్ప దీక్ష భక్తితో ఒక ముడి, శ్రద్ధతో మరోముడి వేసేదే ఇరుముడి అని, మాట జారకుండా మాటిమాటికీ అయ్యప్పను తలచుకోవడం, శత్రువులోనూ స్వామిని దర్శిం చే గొప్ప గుణం,  మండల దీక్షతో మనసును పునీతం చేసుకునే క్రతువే ఈ అయ్యప్ప దీక్ష అని అన్నారు. అయ్యప్ప స్వాములు అంద రూ విచ్చేసి  శ్రీ అయ్యప్ప స్వామి వారిని దర్శించుకుని, తీర్థప్రసాదాలు స్వీకరించి, శ్రీ అయ్యప్ప స్వామి కృపకు పాత్రు లు కాగలరని కోరారు.

ఈ కార్యక్రమంలో కబ్బీర్ కౌశల్ గురుస్వామి, ప్రవీణ్ గురుస్వామి, ఆంజనేయులు గురుస్వామి, ప్రకాష్ స్వామి, రాకేష్ స్వామి, ప్రవీణ్ స్వామి, రాజు స్వామి, దత్తు స్వమి, సీనియర్ విలేకరులు శ్రీనివాస్, వినయ్ గౌడ్, బీజేపీ లీడర్ రాజేష్ గౌడ్, బిఆర్‌ఎస్  డివిజన్ ప్రెసిడెంట్ కిరణ్ యాదవ్, శ్రీధర్ ముదిరాజ్, భజన మండలి గంగపుత్ర నర్సింగరావు తదితరులు పాల్గొన్నారు.