calender_icon.png 4 December, 2025 | 12:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముగిసిన నామినేషన్ల పరిశీలన..

03-12-2025 11:21:50 PM

17 జీపీలకు 88 

156 వార్డుకు 389 నామినేషన్లు 

బెల్లంపల్లి అర్బన్ (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గంలో రెండో విడతగా వేసిన నామినేషన్ల ప్రక్రియ పరిశీలన ప్రక్రియ బుధవారం ముగిసింది. బెల్లంపల్లి మండలంలో 17 గ్రామ పంచాయతీలకు గాను 88 మంది సర్పంచ్ అభ్యర్థులు నామినేషన్ వేశారు. స్క్రూటినీలో 17 గ్రామ పంచాయతీలకు పడిన 88, నామినేషన్లు చెల్లుబాటయ్యాయి. 156 వార్డులకు గాను వేసిన 389 నామినేషన్లను అధికారులు ఆమోదించారు. దీంతో నామినేషన్ల ప్రక్రియ ముగిసింది.

నామినేషన్ల పరిశీలన ప్రక్రియను జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ విజిట్ చేశారు. 4వ తేదీన అప్పిల్లకు గడువు, 5న అప్పిల్ ల పరిష్కారం, 6 నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ఉంటుంది. అనంతరం బరిలో ఉండే అభ్యర్థుల తుది జాబితాను ప్రకటిస్తారు. ఈ ఘట్టం ముగిసిన వెంటనే ఎన్నికల పోరులో తలపడతారు. 14న ఎన్నికలు అదే రోజు ఓట్ల లెక్కింపు వెంటనే ఫలితాలు ప్రకటిస్తారు.