15 May, 2026 | 9:36 PM

Breaking News

పోలీస్ వారి ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంపు

15-05-2026 08:38 PM

బెజ్జూర్,(విజయక్రాంతి): బెజ్జూర్ మండల కేంద్రంలోని గిరిజన ఆశ్రమ పాఠశాల ప్రాంగణంలో పోలీసు వారి ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్సై సర్తాజ్ పాషా తెలిపారు. ఉచిత మెడికల్ క్యాంపు ఈనెల 17 ఆదివారం రోజు ఉదయం 9 గంటలకుమంచిర్యాలలోని మెడిలైఫ్ ఆసుపత్రి వారి ప్రోత్సాహంతో ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహించడం జరుగుతుంది. ఇట్టి మెడికల్ క్యాంపులో డాక్టర్లు జనరల్ మెడిసిన్, జనరల్ సర్జన్, స్రీ  వైద్య నిపుణురాలు, ఎముకల, కీళ్ల, కంటి, చాతి, పిల్లల నిపుణులు ఉచితంగా వైద్య సహాయం అందించడం జరుగుతుంది. ఈసీజీ కూడా చేయడం జరుగుతుందని తెలిపారు.మెడికల్ క్యాంపు అనంతరం మధ్యాహ్న భోజనం కూడా ఉంటుందని అన్నారు.ఇట్టి అవకాశాన్ని మండల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు.