17 July, 2026 | 4:29 PM

పుష్కర ఘాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్

17-07-2026 04:29 PM

నిర్మల్,(విజయక్రాంతి): గోదావరి పుష్కరాల  దృష్టిలో ఉంచుకుని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని శాఖల సమన్వయంతో పటిష్ట ఏర్పాట్లు చేపట్టాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం సోన్ మండలంలోని పుష్కర ఘాట్లను కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఘాట్ల వద్ద చేపట్టాల్సిన అభివృద్ధి పనులు, భక్తులకు కల్పించాల్సిన సౌకర్యాలపై అధికారులకు పలు కీలక సూచనలు చేశారు.

పుష్కరాల నాటికి ఘాట్లను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసి భక్తులకు సురక్షితమైన, సౌకర్యవంతమైన వాతావరణం కల్పించాలని సూచించారు. గత పుష్కరాల్లో నమోదైన భక్తుల రద్దీ వివరాలను తెలుసుకొని, ఈసారి అంచనా మేరకు అవసరమైన ఏర్పాట్లు చేయాలనన్నారు. చేపట్టే అన్ని పనులు నాణ్యతతో, మన్నికగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పుష్కర మార్గాల్లో సూచిక బోర్డులు పార్కింగ్ ఇతర సౌకర్యాలు చేపట్టాలని సూచించారు. ఈ పరిశీలనలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి. వెంకటేశ్వర్లు, ఇరిగేషన్ ఈఈ అనిల్, తహసీల్దార్ సంతోష్, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.