9 April, 2026 | 4:19 AM

రావులపల్లి గ్రామంలో ఉచిత వైద్యశిబిరం

09-04-2026 01:35 AM

చేవెళ్ళ, ఏప్రిల్ 8(విజయక్రాంతి): చేవెళ్ల మండల పరిధిలోని రావులపల్లి గ్రామ పంచాయతీ ప్రాంగణంలో మలక్పేట్ యశోద ఆసుపత్రి ఆధ్వర్యంలో గ్రామ సర్పంచ్ గోటూరి రామచంద్రయ్య గౌడ్ సహకారంతో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. జనరల్ ఫిజీషియన్, ఆర్థోపెడిక్ వైద్య సేవలతో పాటు ఆఫ్తాల్మాలజీ (కంటి) పరీక్షలు నిర్వహించారు. సర్పంచ్ రామచంద్రయ్య మాట్లాడుతూ... గ్రామ ప్రజల ఆరోగ్యమే ధ్యేయంగా వైద్య శిబిరం నిర్వహించామన్నారు.

శిబిరానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించిందని ప్రజా ఆరోగ్యం సంక్షేమం కోసం ఇలాంటి కార్యక్రమాలు మునుముందు కూడా కొనసాగిస్తానని చెప్పారు. గ్రామంలో పేద ప్రజలు, వృద్ధులు వికలాంగులు చిన్నపిల్లలు ఆరోగ్యపరమైన సమస్యలతో బాధపడుతున్నారని చెప్పారు. నగరానికి వెల్లెందుకు ప్రజలు సతమతమైతున్న క్రమంలో ఈ ఉచిత శిభిరం నిర్వహించామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో డా. సునీల్ (జనరల్ ఫిజీషియన్) డా. అఖిల్ (జనరల్ మెడిసిన్)డా. అశోక్ రెడ్డి, రావులపల్లి ఉప సర్పంచ్ అనూష అంజన్ కుమార్, పి.ఏ.సి.ఎస్ డైరెక్టర్ కేసారం నరేందర్, వార్డు సభ్యులు: కౌకుంట్ల జ్యోతి వెంకటేష్, జి. మల్లీశ్వరి హనుమంత్, కుమ్మరి గోపాల్, మాజీ ఉప సర్పంచ్ పి. నాగి రెడ్డి, మాజీ వార్డు సభ్యులు: పి. హనుమంత్ రెడ్డి, బుద్దనోల కుమార్, సి. అశోక్, గజ్జలి యాదయ్య, బుద్దనోల కృష్ణ ప్రసాద్, గోటూరి విజయ్ కుమార్, బూర్ల కుమార్ (జి), చాకలి రాజు, బేగరి రవీందర్ ,బూర్ల కుమార్, టీ లక్ష్మణ్, శ్రీకాంత్ రెడ్డి గ్రామ మహిళలు తదితరులు పాల్గొన్నారు.