డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి: కోటపల్లి సిఐ కృష్ణ
కోటపల్లి, (విజయక్రాంతి) : యువత డ్రగ్స్, మత్తు పదార్థాలకు అలవాటు పడి జీవితాలను నాశనం చేసుకోవద్దని, డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని కోటపల్లి సిఐ కృష్ణ పేర్కొన్నారు. కోటపల్లి పోలీసులు మండలంలోని పారుపల్లి గ్రామంలో బుధవారం ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై కోటపల్లి ఎస్సై రాజశేఖర్ తో కలిసి ఆయన మాట్లాడారు. చెడు వ్యసనాలకు యువత బానిస కాకుండా తమ భవిష్యత్తును లక్ష్యంగా చేసుకుని ముందుకు సాగాలని సూచించారు. అలాగే రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ హెల్మెట్, సీట్‌బెల్ట్ తప్పనిసరిగా ధరించాలని తెలిపారు. అనంతరం ఇదే గ్రామానికి చెందిన బోగే రాజేష్ ఇటీవల అగ్నివీర్ (ఆర్మీ)కు ఎంపికైన సందర్భంగా ఘనంగా సన్మానించారు. యువతలో క్రీడాస్ఫూర్తిని పెంపొందించేందుకు వాలీబాల్ కిట్‌ను అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువత, అధికారులు గ్రామస్థులు పాల్గొన్నారు.






