99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక లో భాగంగా గ్రామసభ
తూప్రాన్, జూన్ 11 (విజయ క్రాంతి): తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక లో భాగంగా తూప్రాన్ మండలం నర్సంపల్లి గ్రామంలో గ్రామ సభను గ్రామ సర్పంచ్ ధరావత్ భాస్కర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డిఎల్పిఓ పాల్గొని అమూల్యమైన సందేశాన్ని అందించారు. ముఖ్యంగా గ్రామంలో చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేయకూడదని మరుగుదొడ్ల నిర్మాణం చేసుకోవాలని, ప్రతి ఒక్కరు ప్రతి ఇంటికి ఒక్కొక్క మొక్కను నాటాలని భూగర్భ జలాలు అడుగంటి పోకుండా ఇంకుడు గుంతల నిర్మాణం చేయాలని సూచించారు.
అనంతరం గ్రామస్తులు కొందరు నిలబడి మా గ్రామంలో అనేక సమస్యలు నెలకొన్నాయని ఇందులో ముఖ్యంగా కరెంటు కోతలు, ఎరువుల కొరత, మంచినీటి ఎద్దడి ఇలా చెప్పుకుంటూ పోతే అనేక సమస్యలు నెలకొన్నాయని అధికారులతో వారు తెలిపారు. తక్షణమే అధికారులు స్పందిస్తూ మిషన్ భగీరథ పై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇందులో గ్రామ సీనియర్ నాయకులు జింక మల్లేష్, మాజీ సర్పంచ్ కత్తుల సత్యనారాయణ, భగీరథ ఏ ఈ, సెక్రెటరీ స్వామి, ఉపసర్పంచ్, పాలకవర్గం సభ్యులు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.






