11 June, 2026 | 12:11 PM

పోలీసుల అదుపులో పోక్సో కేసు నిందితుడు

11-06-2026 11:13 AM

కోటపల్లి, (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా చెన్నూర్ నియోజక వర్గంలో అమ్మమ్మ ఇంటికి వెళ్ళినా మైనర్ బాలికపై అత్యాచారయత్నంకు పాల్పడిన నిందితుడిని కోటపల్లి పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నట్లు సమాచారం. బాధిత కుటుంబం నుంచి ఫిర్యాదు అందిన వెంటనే అప్రమత్తమైన పోలీసు యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించి దర్యాప్తును వేగవంతం చేసింది. సేకరించిన ఆధారాలు, సాంకేతిక సమాచారం ఆధారంగా నిందితుడి ఆచూకీ గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది.

కేసు తీవ్రతను దృష్టిలో ఉంచుకుని అధికారులు అన్ని కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నారు. నిందితుడిని విచారించి ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు సేకరించినట్లు తెలుస్తోంది. పోలీసులు నిందితుడిని నేడు లేదా రేపు కోర్టులో హాజరుపరచనున్నట్లు సమాచారం. చిన్నారులపై నేరాలకు పాల్పడే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని, చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసు అధికారులు హెచ్చరిస్తున్నారు. నిందితుడికి చట్టం ప్రకారం శిక్ష పడేలా అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టి సాక్షాలతో కోర్టులో హాజరుపరచనున్నారు.