18 August, 2026 | 7:54 PM

Breaking News

సామాజిక న్యాయం కోసం పోరాడిన గొప్ప సంఘ సంస్కర్త సర్వాయి పాపన్న గౌడ్   •   సర్వాయి పాపన్న గౌడ్ పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం   •   ప్రజా సమస్యలపై ఎమ్మెల్యే ఫోకస్‌.. అధికారులకు క్లాస్‌   •   పాలిటెక్నిక్ విద్యార్థుల ర్యాలీ.. రాస్తారోకో   •   చెన్నూర్ లో ఘనంగా పాపన్న గౌడ్ జయంతి వేడుకలు   •   పశు పోషణ యాజమాన్య పద్ధతులపై రైతులకు అవగాహన కార్యక్రమం   •   సేంద్రియ వ్యవసాయంతో లాభాలు   •   ఈనెల 19న జిల్లాకు ఎస్టీ, ఎస్సీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకయ్య   •   ఘనంగా సర్వాయి పాపన్న జయంతి వేడుకలు   •   అర్జున అవార్డులకు ఎంపికైన తెలంగాణ క్రీడాకారులకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు   •  

రెండు లారీలు ఢీ: క్యాబిన్‌లోనే కాలిబూడిదైన డ్రైవర్

11-06-2026 11:10 AM

సోనాల మండలం గుట్ట పక్క తండాలో విషాదం.

బోథ్,జూన్ 11 (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా మామడ మండలంలోని బూరుగుపల్లి సమీపంలో గురువారం తెల్లవారుజామున లారీలు ఢీకొనడంతో ఒకేసారి లారీకి మంటలు అంటుకోవడంతో లారీ క్యాబిన్లో ఇరుక్కుపోయిన డ్రైవర్ జవార్ సింగ్ (41) మృతి చెందాడు. సోనాల మండలంలోని గుట్ట పక్క తాండకు చెందిన మృతునికి ముగ్గురు ఆడపిల్లలతో పాటు కుమారుడు ఉన్నాడు. గత పది సంవత్సరాలుగా కుటుంబ పోసిన కోసం లారీ డ్రైవర్ గా నిధులు నిర్వహిస్తున్నట్లు తెలిసింది. గుంటెడు భూమి సహితం లేకపోవడంతో కుటుంబం పెద్దదిక్కును కోల్పోయి నట్లయింది. సంఘటన వివరాలు తెలియడంతోనే కుటుంబీకులు గ్రామస్తులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. నిర్మల్ ప్రభుత్వ ఆసుపత్రిలో శవ పంచనామా జరగనున్నట్లు తేలడంతో అక్కడికి చేరుకున్నారు. ఏది ఏమైనా డ్రైవర్ మృతితో గ్రామంలో విషాద చాయలు అమ్ముకున్నాయి