08-02-2026 06:56:43 PM
సర్పంచి బొల్లెపల్లి రామనాథం గౌడ్
గరిడేపల్లి,(విజయక్రాంతి): పత్రికలు ప్రజాస్వామ్యానికి దిక్సూచి కావాలని సర్పంచి బొల్లెపల్లి రామనాథం గౌడ్ అన్నారు. ఆదివారం మండలంలోని కీతవారిగూడెం గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో గరిడేపల్లి మండల ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కొండ సైదులు గౌడ్, ప్రధాన కార్యదర్శి ఎల్లావుల వెంకటేష్ యాదవ్ లకు పూలమాలలు,శాలువులతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రజాస్వామ్య వ్యవస్థలో పత్రికల పాత్ర ఎంతో కీలకమైందని, ప్రజా సమస్యలను నిష్పక్షపాతంగా వెలుగులోకి తీసుకువచ్చే బాధ్యత పాత్రికేయులదేనని అన్నారు.
ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా నిలిచి నిజమైన సమాచారంతో ప్రజలను చైతన్యవంతుల్ని చేయడమే పత్రికల లక్ష్యంగా ఉండాలని పేర్కొన్నారు. మండలంలో ఆరవ సారి ఏకగ్రీవంగా ఎన్నికైన అధ్యక్ష కార్యదర్శులకు కమిటీ సభ్యులకు గ్రామస్తులతో కలిసి ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ దాసరి శ్రీనివాస్ యాదవ్, హుజూర్నగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ పెడమర్తి అంజి, బిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ యువజన నాయకులు కీత పరుశురాం, షేక్ సైదా హుస్సేన్, నర్సింగ్ వెంకన్న, నర్సింగ్ కాశయ్య, పోలంపల్లి సైదులు, గుండు వీరబాబు, దాసరి నాగేంద్రబాబు,షేక్ సలీం, చనగాని నరసింహ తదితరులు పాల్గొన్నారు.