30 August, 2026 | 1:06 AM

దమ్మపేటలో ఉచిత పశువైద్య శిబిరం

30-08-2026 12:00 AM

దమ్మపేట,(విజయక్రాంతి): పాడి రైతులు పశువుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని దమ్మపేట సర్పంచ్‌ పగడాల రమాదేవి పేర్కొన్నారు. దమ్మపేట గ్రామంలో పశువైద్య, పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత పశువైద్య శిబిరాన్ని శనివారం ఆమె ప్రారంభించారు. ఈ శిబిరంలో భాగంగా పశువైద్యాధికారులు గేదెలు, ఆవులకు వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన చికిత్సలు అందించారు. అలాగే  గొర్రెలు, మేకల పెంపకందారులకు ఉచితంగా మందులను పంపిణీ చేశారు. సీజనల్ వ్యాధుల బారిన పడకుండా పశువులకు ముందస్తు టీకాలు వేయించుకోవాలని వైద్యులు రైతులకు సూచించారు.