30 August, 2026 | 1:25 AM

మాజీ ఎంపీపీ నాగినేని జగన్ మోహన్ రావును పరామర్శించిన మాజీ జడ్పీటీసీ

30-08-2026 12:52 AM

ముత్తారం,(విజయక్రాంతి): ముత్తారం మాజీ ఎంపీపీ, జడ్పిటిసి నాగినేని జగన్ మోహన్ రావును మాజీ జడ్పీటీసీ సభ్యులు మైదం భారతి,వరప్రసాద్ శనివారం కరీంనగర్‌లో పరామర్శించారు. ఇటీవల అనారోగ్యానికి గురైన నాగినేని జగన్ మోహన్ రావు హైదరాబాద్‌లో చికిత్స పొందిన అనంతరం కరీంనగర్‌కు వచ్చిన సందర్భంగా ఆయనను కలిసి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.

ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితిపై వివరాలు తెలుసుకుని, త్వరగా పూర్తిస్థాయిలో కోలుకోవాలని ఆకాంక్షించారు. జగన్ మోహన్ రావు సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి ప్రజల మధ్యకు వచ్చి, గతంలో మాదిరిగానే ప్రజాసేవలో చురుగ్గా పాల్గొనాలని మైదం భారతి, మైదం వరప్రసాద్ ఆకాంక్షించారు. ఆయన త్వరగా కోలుకుని ప్రజాసేవలను కొనసాగించాలని ఈ సందర్భంగా వారు కోరుకున్నారు.